Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీకి చెందిన గురుగు హిమప్రియకు...
న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు ప్రదానం చేశారు. సోమవారం వర్చువల్ మోడ్లో జరిగిన కార్యక్రమంలో 2021-22 ఏడాదికి గాను 29 మంది రాష్ట్రీయ బాల పురస్కార్ గ్రహీతలతో మాట్లాడిన ప్రధాని మోడీ, అనంతరం బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సర్టిఫికెట్లు అందించారు. తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన తేలుకుంట విరాట్ చంద్రతో పాటు ఏపీకి చెందిన శ్రీకాకుళం అమ్మాయి గురుగు హిమప్రియలు పురస్కారాలను అందుకున్నారు. గతేడాది మార్చిలో విరాట్ ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తైన కీలీ మంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. కాగా జమ్మూలోని సుంజువన్ మిలిటరీ క్యాంపుపై టెర్రరిస్ట్ దాడిలో చాకచక్యంగా వ్యవహరించినందుకు, గురుగు హిమప్రియ ధైర్య సాహసాల గుర్తింపు గాను అవార్డు అందించారు. వీరంతా ఢిల్లీలోని రాజ్పథ్పై జరిగే గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొననున్నారు.