Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జెఎన్‌యు విద్యార్థి షార్జిల్ ఇమామ్‌పై దేశద్రోహ అభియోగాలను ఢిల్లీ కోర్టు నమోదు చేసింది. 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల సందర్భంగా షార్జిల్ రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారంటూ నమోదైన కేసులో ఈ అభియోగాలు నమోదయ్యాయి. ఐపిసిలోని సెక్షన్లు 124 (దేశద్రోహం), 153ఎ (మతం కారణంతో వివిధ గ్రూపుల మధ్య శతృత్వాన్ని పెంపొందించడం), 153బి (జాతీయ సమగ్రతకు భిన్నమైన వాదనలు వినిపించడం), 505 (ప్రజల్లో అనుమానాలు రేకెత్తేలా ప్రకటనలు చేయడం), యుఎపిఎ సెక్షన్ 13 (చట్టవిరుద్ధ కార్యకలాపాలకు శిక్ష) కింద షార్జిల్‌పై అభియోగాలు రూపొందించినట్లు అదపు సెషన్స్ న్యాయమూర్తి అమితాబ్ రావత్ తెలిపారు. 2020 జనవరి నుంచి షార్జిల్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.