Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిజిటల్ ప్రచారానికి తెరతీశారు. ' కేజ్రీవాల్‌కి ఒక అవకాశం' పేరిట డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. రాష్ట్రంలో జరిగిన అభివద్ధి, ఆప్ ప్రభుత్వ పనితీరు గురించి సోషల్‌మీడియాలో ప్రచారం చేయాలని ఢిల్లీ ప్రజలను కోరారు. నెట్లో వైరల్‌గా మారిన వీడియోల నుండి ఎంపిక చేసిన 50 మందిని .. అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిన్నర్‌కి ఆహ్వానిస్తామని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన అభివద్ధి గురించిన వీడియోలను, దాని ద్వారా మీరు పొందిన ప్రయోజనాల గురించి ట్విటర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఇతర రాష్ట్రాల ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అలాగే ఆయా రాష్ట్రాల్లో మీకు తెలిసిన వాట్సప్ ఖాతాదారులకు కేజ్రీవాల్‌కు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయాలని అన్నారు. ఢిల్లీ ప్రజల కోసం ప్రభుత్వం అనేక ప్రయోజనాలు కల్పించిందని, ఉచిత విద్యుత్, మంచినీటిని అందించిందని, అలాగే మొహల్లా క్లినిక్స్‌లను ఏర్పాటు చేసిందని అన్నారు. ఇక్కడి పాఠశాలలను అమెరికా అధ్యక్షుడి భార్య కూడా సందర్శించారని అన్నారు.
పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే.