Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు మృతి
- పేలుడు పదార్థాలు స్వాధీనం
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్పీ గిరజా శంకర్ జైస్వాల్, ఏఎస్పీ నీరజ్ చంద్రకర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వివరాలు వెల్లడించారు. భరందా పోలీస్ స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్జీ బృందాన్ని సెర్చ్ ఆపరేషన్‌కు పంపి నట్టు తెలిపారు. జవాన్లను చూసిన మావోయిస్టులు కాల్పులు జరి పారనీ, దాంతో పోలీసులూ ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. కాల్పులు ముగిసిన తర్వాత పరిసర ప్రాంతాన్ని డీఆర్జీ బృం దం పరిశీలించగా ఒక మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకు న్నారు. అయితే అతని గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. మృత దేహం తో పాటు ఒక బార్బర్, కుక్కర్ బాంబు, రోజువారీ ఉపయోగకరమైన వస్తువులను జవాన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.