Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో 95.3 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్) సుశీల్ చంద్ర అన్నారు. మంగళవారం జరిగిన నేషనల్ ఓటర్సుడే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మరో 1.92 కోట్ల మంది సీనియర్ సిటిజన్లు (60ఏళ్లు పైబడినవారు) ఉన్నారని సీఈసీ వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారనీ, ఓటు హక్కును వినియోగించు కోవడం ప్రజాస్వామ్యానికి ఇస్తున్న గౌరవంగా భావిస్తున్నారని ఆయన తెలిపారు. కేవలం 18 శాతం అక్షరాస్యతా ఉంది. కొత్తగా స్వాతంత్య్రం సాధించుకున్న దేశం వేగవంతమైన అభివద్ధికి ఈ రైట్ టు ఓట్ ఎంతో తోడ్పడిందని ఆయన చెప్పారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేశామన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాతంగా పూర్తి చేస్తానని సీఈసీ చెప్పారు.