Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొంతమేర తగ్గింది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు మూడులక్షలకు పైగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 2,55,874 కరోనా కేసులు వచ్చాయి. సోమవారంతో పోలిస్తే.. 16 శాతం మేర క్షీణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 శాతం దాటిన రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 15.52 శాతానికి పడిపోయింది. రికవరీలు కూడా ఎక్కువగా నమోదైనట్లు సమాచారం. సోమవారం 2,67,753 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 93.15 శాతంగా ఉన్నాయి. క్రియాశీల రేటు 5.62 శాతంగా ఉంది. ఒక్క కర్ణాటకలోనే 46 వేల కేసులు రాగా, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు తెలిపాయి. మొత్తం కేసుల సంఖ్య 3.97 కోట్లకు చేరినట్లు కేంద్రం తెలిపింది. అయితే మఅతుల సంఖ్యలో మాత్రం పెరుగుదల ఆందోళన కనిపిస్తోంది. గత 24 గంటల్లో 614 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 4.9 లక్షలకు చేరింది. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడతాయని కేంద్రం అంచనా వేసింది.