Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఒమిక్రాన్ ప్రభావం పార్లమెంటు ఉభయసభలపైనా పడింది. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం బులిటెన్ విడుదల చేసింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటలవరకు లోక్‌సభ నిర్వహించనున్నట్లు ఆ బులెటెన్‌లో తెలిపింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ కోసం లోక్‌సభ ఉదయం 11 గంటలకు సమావేశమవుతుంది. ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్ నుండి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2వ తేదీ నుంచి 11 వరకు సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్‌సభ జరగనుంది. కరోనా నిబంధనలను అనుసరించి సభ్యులు భౌతిక దూరం పాటించేలా ఉభయ సభలతో పాటు సెంట్రల్ హాల్లలో ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు. కాగా, ఇటీవల రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన హైదరాబాద్‌లో ఉన్నందున రాజ్యసభకు సంబంధించిన సమయాలపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.