Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17 పద్మవిభూషణ్.. 107 మందికి పద్మశ్రీ
న్యూఢిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'పద్మ' అవార్డుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ సీఎండీ కష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్ పురస్కారం వరించింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు కోవిషీల్డ్ టీకా తయారు చేసిన సీరమ్ సంస్థ వ్యవస్థాపకులు సైరస్ పూనావాలా, ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్ సీఈవో సుందర్ పిచారు, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు. ఈ విషయం గురించి తనకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదనీ, ఈ విషయంపై తనకేమాత్రం తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ పురస్కారానికి ఎంపిక చేసివుంటే తాను స్వీకరించబోనని స్పష్టం చేశారు. కాగా తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఏపీ నుంచి గోసవీడు షేక్ హసన్ (కళారంగం)బీ డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం)బీ గరికపాటి నరసింహారావు ఉన్నారు..