Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది చాలా తీవ్రమైన అంశం
- రాజకీయ లబ్ది కోసం జనాకర్షణ విధానాలు రాజ్యాంగ విరుద్ధం
- దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుంది
- కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీం నోటీసులు
- నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలి
న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు ఓటర్లను ప్రలోభ పెడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చి ఉచిత హామీలు (వాగ్దానాలు) తీవ్రమైన సమస్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ పరిస్థితిని ఎలా కట్టడిచేస్తారో సమాధానం చెప్పాలంటూ ఎన్నికల సంఘం, కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింప చేయాలనీ, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని న్యాయవాది అశ్విన్ ఉపాధ్యారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ''ఈ చట్ట విరుద్ధ మైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో, చట్టబద్ధంగా ఎలా నియంత్రిం చాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగల మా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఈ పరిస్థితిని నిరోధించేందుకు సాధ్యమవుతుందా..? ఉచిత హామీలు సాధారణ బడ్జెట్‌ను మించిపోతోంది'' అని జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యానించారు. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమనీ, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అన్నారు. ఇది చాలా తీవ్రమైన సమస్య అంటూ మార్గదర్శకాలను రూపొందించాలంటూ గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు.