Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వే ఫలితాల్లో అక్రమాలంటూ నిరసనలు
- బీహార్‌లో నిరుద్యోగులపై టియర్‌గ్యాస్ ప్రయోగం
పాట్నా. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ) పరీక్ష ...2021 ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ..మంగళవారం యువత భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలతో బీహార్ అట్టుడికింది. అభ్యర్థులన కట్టడిచేయటానికి పోలీసులు లాఠీచార్జిలు, టియర్‌గ్యాస్‌లను ప్రయోగించారు.
రైలు పట్టాలపై బైటాయింపు..
బీహార్ ఒక్కసారిగా భగ్గుమన్నది. ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ రిజల్ట్స్‌ను మోడీ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.ఈ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ నలంద, నవాడ, సీతామర్హి, బక్సర్, అర్రా, ముజఫర్‌పూర్ లలో అభ్యర్థులు రైల్వే ట్రాక్‌లపై బైటాయించారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూర్చున్నారు. దీంతో ఢిల్లీ వెళ్లే శ్రామిక్ రైలు, ఢిల్లీ నుంచి వస్తున్న శ్రామిక్ రైలు ఔటర్‌లోని నలందలో నిలిచిపోయాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న అభ్యర్థులు ముజఫర్ పూర్ జంక్షన్‌లోనూ పలు రైళ్లను నిలిపివేశారు. సీతామర్హిలో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు 25 రౌండ్లు కాల్పులు జరిపారు. అర్రాV్ాలోనూ నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించారు. స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కుందన్ రాజ్ మాట్లాడుతూ పరీక్ష తర్వాత బోర్డు నిబంధనలను మార్చి విడుదల చేస్తుందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు కుందన్ రాజ్ తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఉద్యోగ అర్హత పొందలేకపోతున్నారని వివరించారు. బోర్డు ఎలాంటి నియమాలు రూపొందించినా, పరీక్షకు ముందు దానిని రూపొందించాలి. కానీ అలా జరగలేదన్నారు. ఈ ఫలితాల్లో మనీగేమ్ ఆడిందనీ, అందువల్లే ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఇప్పుడు గ్రూప్ డీ పరీక్షను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గందరగోళానికి గురిచేస్తోందని వివరించారు.