Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అప్రమత్తం..
ముంబయి : ప్రపంచ మదుపర్ల దృష్టి అంతా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సమీక్షపైనే ఉంది. బుధవారం ప్రారంభమైన రెండు రోజుల ఫెడ్ సమావేశాల్లో వడ్డీ రేట్లు పెంచొచ్చని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. 40 ఏళ్ల తర్వాత తొలి సారి పెంచాలనకునే ఈ రేట్లతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. ఇదే క్రమంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఐదు సెషన్లలో సెన్సెక్స్ 3,820 పాయింట్లు, నిఫ్టీ 1,189 పాయింట్ల చొప్పున క్షీణించాయి. ఈ కాలంలో మదుపర్ల సంపద 19.5 లక్షల కోట్లు ఆవిరయ్యింది. వరుస నష్టాల నుంచి మంగళవారం ఉపశమనం లభించినప్పటికీ నేటి గురువారం సెషన్‌పై తీవ్ర ఉత్కంట నెలకొంది. జనవరి 25, 26న రెండు రోజుల పాటు అమెరికా ఫెడ్ సమీక్షా నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగానే ప్రకటించబడితే.. భారత మార్కెట్లు కుప్పకూలొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా రిటైల్ మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.