Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా నాలుగు రోజులుగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాక..తాజా మళ్లీ కేసులు పెరిగాయి. మంగళవారం 2,83,499 కేసులు నమోదయ్యాయి. 659 మంది మరణించారు. మునుపటి రోజుతో పోలిస్తే కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య 27 వేలకు పెరిగింది. ప్రస్తుతం, దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు అంటే చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 22.15 లక్షలు. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్లు దాటింది. వాస్తవానికి ప్రభుత్వాలు చెబుతున్న లెక్కలకంటే..కేసులు,మరణాలు అధికంగానే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. గుజరాత్లో కరోనా మరణాలపై దొంగలెక్కలు చూపినట్టు నిర్థారైంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన జాబితా, మృతుల పరిహారాల మధ్య తేడా ఉండగా..దీనిపై అక్కడి బీజేపీ పాలకులను సుప్రీం నిలదీసిన విషయం విదితమే. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అంకెలు గారడీ ఉన్నట్టు ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఆరోపిస్తున్నాయి.