Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ పురస్కారాన్ని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించిన విషయాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ సామాజిక మాధ్యమాల్లో పునరుద్ఘాటించింది. ప్రభుత్వం నుంచి ఈ తరహా పురస్కారాలను స్వీకరించరాదనేది తమ పార్టీ విధానమని పేర్కొంది. తమ కృషి అంతా ప్రజల కోసమే కానీ పురస్కారాల కోసం కాదని తెలియజేసింది. కామ్రేడ్ ఇఎంఎస్ నంబూద్రిపాద్ కూడా గతంలో తిరస్కరించారని గుర్తు చేసింది.