Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్ ఎదుర్కొనేందుకు పాటిస్తున్న రక్షణ చర్యలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించాలని, ఏమాత్రం పట్టు సడలించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ కేసులు క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శులకు లేఖ రాశారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారు లను అప్రమత్తం చేయాలని కోరారు.