Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదిని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ : తెలంగాణ హైకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ పరిస్థితి తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది సిద్ధార్ధ అగర్వాల్‌కు సూచించింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్,జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. హైకోర్టులో విచారణ స్థితి ఏంటని జస్టిస్ వినీత్ శరణ్ ప్రశ్నించగా...2021 జూన్ 18న హైకోర్టు కేసు విచారణ చేసిందనీ,తదుపరి వాయిదా ఆగస్టు 21నాడు విచార ణకు రాలేదని రేవంత్ తరపు న్యాయవాది సిద్ధార్ధ అగర్వాల్ తెలిపారు.జూన్ 18 నాటి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశామని తెలిపారు. అయితే,హైకోర్టులో ఏం జరిగింది..ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సిద్ధార్ధ అగర్వాల్‌ను జస్టిస్ వినీత్ శరణ్ ఆదేశించారు.తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు. ఇదే కేసుకు జత అయిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిటిషన్‌ను కూడా అప్పు డే విచారిస్తామని తెలిపారు. కేసు నుంచి తన పేరు తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.