Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనాను కట్టడి చేసేందుకు భారత్లో అభివృద్ధి చేసినకోవిషీల్డ్, కోవాగ్జిన్లను బహిరంగ విపణిలో విక్రయించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) గ్రీన్ సిగల్ ఇచ్చింది. న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019కింద అనుమతులిచ్చింది. అయితే అందుకు గానూ కొన్ని షరతులను విధించింది.వయోజనులకు అందించేందుకు కొన్ని షరతులకు లోబడి ఈ రెండు వ్యాక్సిన్లను మార్కెట్లో విక్రయించేందుకు అనుమతిలిచ్చినట్టు ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయా గురువారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.