Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరి, మార్చి నెలల్లో వ్యవసాయ కార్మికుల ఆందోళనలు
- ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్
అమరావతి : వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాల అమలుకోసం సమగ్ర చట్టంచేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ డిమాండ్ చేశారు. అందుకోసం ఫిబ్రవరి, మార్చి నెలల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఉద్యమాలకు కార్యచరణ రూపొందించాలని కోరారు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరం బైపాస్‌లోని కెబి భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం గురువారం జరిగింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బి. వెంకట్ మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో దేశంలోని 58 కోట్ల మంది ఆస్తులు తగ్గిపోగా కేవలం పది కుటుంబాల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. బడా పెట్టుబడిదారులైన కుటుంబాల ఆస్తులు లక్షల కోట్ల రూపాయలు కొత్తగా సమకూరాయని అన్నారు. కోవిడ్ సహాయం పేరుతో మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నదని విమర్శించారు. అలాగే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ మోడీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు. మోడీ ప్రభుత్వం మాట తప్పడంతో ఈ నెల 31న దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ సంఫ్‌ు నేతృత్వంలో జరిగే బీజేపీ విద్రోహ దినం కార్యక్రమంలో వ్యవసాయ కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరిగే కార్మిక సమ్మెకూ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. మోడీ ప్రభుత్వం ఫాసిస్టు దోరిణీతో రాష్ట్రాల హక్కులను హరిస్తున్నా రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిఘటించకపోవడం శోచనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇచ్చినట్లుగా ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి రూ.25,000లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చౌకదుకాణాల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులను ఉ చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.