Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకుడిని చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) భారత సైన్యానికి అప్పగించినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన 19ఏళ్ల మిరామ్ తరోన్ ఈ నెల18వ తేదీ నుంచి కనిపించకుం డాపోయారు.అయితే అతను దారితప్పి చైనాలోకి ప్రవేశించడంతో అతడిని ఆ దేశ సైన్యం భారత్కు అప్పగించింది. నిర్దేశిత ప్రక్రియను అనుసరించి యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ట్వీట్ చేశారు.