Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాజధాని ఢిల్లీలో సామూహిక లైంగికదాడి
- ఈ దారుణానికి ప్రేరేపించిన మహిళలు
- బాధితురాలికి గుండు కొట్టించి.. ముఖానికి నల్లరంగు పూసి.. చెప్పుల దండతో ఊరేగింపు
- ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అమానవీయ ఘటన చోటు చేసుకున్నది. 20 ఏండ్ల ఒక యువతిపై సామూహిక లైంగికదాడికి పాల్పడేలా నిందితులను కొందరు మహిళలు ప్రేరేపించారు. అనంతరం బాధితురాలిపై తీవ్రంగా దాడికి దిగారు. ఆమెకు గుండు కొట్టించారు. ముఖానికి నల్ల రంగు పూశారు. చెప్పులతో బాధిత యువతిని కొట్టారు. చప్పట్లు కొడుతూ ఆ యువతిని చుట్టుపక్కల వీధులలో ఊరేగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో మరిన్ని అరెస్టులు జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనలో ఇప్పటికి నలుగురు మహిళలు అరెస్టయ్యారు.
ఇంట్లో ఉన్న నన్ను ఎత్తుకెళ్లి..
ఈ ఘటన ఢిల్లీలోని కస్తూర్బా నగర్లో చోటు చేసుకున్నది. ఘటన అనంతరం ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.. బాధితురాలిని కలిశారు. '' ఘటన జరిగిన రోజు నేను ఇంట్లో ఉన్నాను. కొందరు మా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకెళ్లారు. స్థానికంగా అక్రమమద్యం, డ్రగ్స్ వ్యా పారంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు నాపై సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. వారు నాపై దారుణానికి ఒడిగడుతున్న క్రమంలో అక్కడ ఉన్న మహిళలే నిందితులను లైంగికదాడికి ప్రోత్సహిం చారు.
అనంతరం వారు నన్ను తీవ్రంగా కొట్టారు. గుండుకొట్టించి ముఖానికి నల్లరంగుపూశారు. చెప్పు లు, షూల దండ వేసి చుట్టుపక్కల వీధుల్లో నన్ను ఊరేగించారు'' అని స్వాతి మలివాల్‌కు బాధితురాలు వివరించినట్టు ఢిల్లీ మహిళా కమిషన్ పేర్కొన్నది.
ఢిల్లీ పోలీసులకు నోటీసులు
ఈ ఘటనను వివరిస్తూ స్వాతి మలివాల్ ట్విట్టర్లో వీడియోను షేర్ చేశారు. ''స్థానికంగా ఉండే కొందరు అక్రమ మద్యం అమ్మకందారులు యువతిపై సామూ హిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువ తికి గుండు గీశారు. ఆమె ముఖంపై నల్లని రంగు పూశారు. అనంతరం బాధిత యువతికి చెప్పుల దండ మెడలో వేసి వీధుల గుండా ఊరేగించారు. ఈ ఘటనపై ఢిల్లీపోలీసులకు నోటీసును జారీ చేస్తున్నా ను. మహిళ, పురుష నిందితులందరినీ అరెస్టు చేయాలి. యువతి, ఆమెకుటుంబానికి రక్షణ కల్పిం చాలి'' అని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. యువతికి భద్రత కల్పించడం కోసం తీసుకున్న చర్యల గురించి ఢిల్లీ పోలీసులను ఢిల్లీ మహిళా కమిషన్ కోరింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలకు సంబంధించిన 72 గంటల్లో సమగ్ర నివేదికను సీసీటీవీ ఫుటేజీతో కమిషన్‌కు అందించాలని ఆదేశించింది. బాధితురాలి సోదరి మాట్లాడుతూ.. '' మా ఇంటి దగ్గర ఉండే ఒక యువకుడు ప్రేమ పేరుతో నా సోదరి వెంటేపడేవాడు. గతేడాది నవంబర్‌లో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తమ కొడుకు చనిపోవడానికి కారణం మా సోదరేనని అతని బంధువులు ఆరోపించారు'' అని తెలిపింది. కాగా, బుధవారం నిందితుల్లో నలుగురిని అరెస్టు చేయగా, గురువారం మరొకరు పట్టుబడ్డారని ఒక పోలీసు అధికారి తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామనీ, ఈ ఘటనకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని వివరించారు.