Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 37.5 కోట్ల డాలర్ల విలువ చేసే ఒప్పందంపై సంతకాలు
న్యూఢిల్లీ : బ్రహ్మోస్ క్షిపణుల కోసం ఫిలిప్పీన్స్, భారత్ మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. తీర ప్రాంతం నుండి ఉపయోగించే నౌకా విధ్వంసక క్షిపణి వ్యవస్థలకై భారత్కు చెందిన బ్రహ్మౌస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిఎపిఎల్)తో ఫిలిప్పీన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ)కి చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ బిఎపిఎల్. ఈ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల సరఫరాకై 37.5 కోట్ల డాలర్ల విలువ చేసే ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. భారత్, రష్యాల సంయుక్త ఉత్పత్తి అయిన ఈ క్షిపణి ఎగుమతుల కోసం వచ్చిన మొదటిఆర్డర్ ఇదే. బ్రహ్మోస్ సిఇఓ అతుల్ డి.రాణె, డిప్యూటీ సిఇఓ సంజీవ్ జోషి, లెఫ్టినెంట్ కల్నల్ నేగి, ప్రవీణ్ పాఠక్ భారత్ తరపున ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిప్పీన్ తమ నావికాదళం కోసం ఈ క్షిపణులు కొనుగోలు చేస్తోంది. గత కొద్ది మాసాలుగా మిత్ర దేశాలకు వీటిని ఎగుమతి చేసేందుకు డిఆర్డిఓ, బిఎపిఎల్ కృషి చేస్తున్నాయి. ఈ రంగంలో ఇదే అతిపెద్ద ఎగుమతుల ఆర్డర్ కావడం విశేషం.