Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడిచిన 24 గంటల్లో రెండున్నర లక్షలకుపైగా కేసులు
- 627 మంది మృతి
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గినా మరణించే వారి సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. రెండున్నర లక్షకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనాతో ఒక్కరోజే 627 మంది ప్రాణాలు కోల్పోగా.. 153 కేరళ రాష్ట్రం నుంచే నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,92,327 మంది కరోనాకు బలయ్యారు. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే.. మహారాష్ట్ర, ఢిల్లీలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా నమోదవుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కాగా, ఒక్క రోజులోనే కేరళలో 51 వేల మందికి కరోనా సోకింది. నమోదైన కరోనా కేసుల్లో 94శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులేనని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కొత్త కేసుల కంటే.. కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతుండటం ఊరట కలిగిస్తున్నది. గడచిన 24 గంటల్లో 3,47,443 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రికవరీ రేటు 93.60 శాతంగా ఉంది. ఇక క్రియాశీల కేసులు సంఖ్య 21 లక్షలకు చేరుకోగా.. క్రియాశీల రేటు 5.18 శాతానికి తగ్గింది. వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా.. కేంద్రం 164 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. ఇప్పటివరకు 95 శాతం మంది మొదటి మోతాదు తీసుకోగా.. 74 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు.