Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రతిపక్షాలు
- పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు, యువత, మహిళలు
న్యూఢిల్లీ : శుక్రవారం బీహార్‌లో విద్యార్థి లోకం తల పెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌కు రాజకీయ, రాజకీయేతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఊరు, వాడా..అనే తేడా లేకుండా విద్యార్థులు, యువత, మహళలు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. కేంద్రంలో మోడీసర్కార్, రాష్ట్రంలో నితిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు మోడీ సర్కార్, ఇటు నితీశ్ పాలనలో తాము మోసపోయామని యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. రాజధాని పాట్నా సహా వివిధ నగరాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాజధాని పాట్నా సహా వివిధ నగరాల్లో రహదారులు, ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు మూతపడ్డాయి.
రోడ్లపై టైర్లను కాల్చుతూ, నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరే కంగా నినాదాలు హోరెత్తాయి. పాట్నాలో రాజ్‌భవన్ దిశ గా వెళ్తున్న విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకున్నారు. గంగా నది వెంబడి సమప్తిపూర్జిల్లా సహా పలుజిల్లాల్లో నిరస నలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. ఈ నిరసనల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బక్సర్, జెహనాబాద్, భాగల్పూర్, కతియార్, బెగూసరారు, ముంగార్ జిల్లాల్లో విద్యార్థుల ఆందోళనకు ఆర్జేడీ, సీపీఐ-ఎంఎల్ పార్టీ నాయకులు మద్దతు పలికారు. ప్రతి పక్ష పార్టీలు, నితీశ్ కుమార్ ప్రభుత్వంలో మిత్ర పక్షాలు విద్యార్థుల బంద్‌కు మద్దతు పలికాయి. ఇటీవల నిర్వహిం చిన ఆర్ఆర్బీ ఉద్యోగ పరీక్షలో అవకతవకలు జరిగా యని వార్తలు వెలువడటంతో బీహార్‌లో విద్యార్థిలోకం ఒక్కసారిగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
మోసపోయామని భావిస్తున్న యువత
ఇటీవల నిర్వహించిన ఆర్ఆర్బీ ఉద్యోగ పరీక్షలో అవకతవకలు జరిగాయని వార్తలు వెలువడటంతో బీహార్‌లో విద్యార్థిలోకం ఒక్కసారిగా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. వీటిని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లేక గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాలకులు చేసిన వాగ్దానాలతో మోసపోయామనే భావన వారిలో గూడుకట్టుకొని ఉంది. ఇదంతా కూడా ఇప్పుడు చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆందోళనల్లో బయటపడుతోం దని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా ముందు ముందు మరిన్ని ఉద్యమాలకు దారితీస్తుందని భావిస్తున్నారు.