Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రక్షణ నిమ్తితం విదేశాల నుంచి ఆయుధ సంపత్తిని దిగుమతి చేసుకునే భారత్.. ఇప్పుడు ఇతరదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. బ్రహ్మోస్ క్షిపణిలకు సంబంధించిన మూడు బ్యాటరీలను కొనుగోలు చేసుకునేందుకు భారత్తో ఫిలిప్పైన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దేశానికి సంబంధించి తొలి రక్షణ ఎగుమతి ఇదే కావడం విశేషం. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు (రూ.2.81 వేల కోట్లు). ఈ మేరకు బ్రహ్మోస్ ఎయిరో స్పేస్ ప్రయివేటు లిమిటెడ్ (బీఏపీఎల్)తో నేషనల్ డిఫెన్స్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఫిలిప్పైన్స్ విభాగంతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. వీటిని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ), రష్యాకు చెందిన ఎన్పీఓ మషినోస్ట్రోమెనియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. బీఏపీఎల్.. డీఆర్డీఓకు చెందిన జాయింట్ వెంచర్ కంపెనీ. ఈ ఒప్పందంపై గతేడాది డిసెంబర్ చివరన చర్చలు జరిపిన ఫిలిప్పైన్స్... అధికారిక ఒప్పందంపై శుక్రవారం సంతకం చేసింది. కాగా, వియత్నాం, థారులాండ్ సహా ఆగేయాసియాలోని పలు ఇతర దేశాలు దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తితో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.