Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు మాసాల గర్భిణీల జాయినింగ్ మార్గదర్శకాల ఉపసంహరణ
న్యూఢిల్లీ : మూడు నెలలు గర్భిణీగా ఉన్న మహిళలను ఉద్యోగంలో తీసుకోరాదంటూ జారీచేసిన నూతన మార్గదర్శకాలపై విమర్శలు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెనక్కు తగ్గింది. ఆ మార్గదర్శకాలను ఉపసంహరించుకుంది. ఈ నూతన మార్గదర్శకాలపై ఎస్బీఐకి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. నూతన మార్గదర్శకాల్లో మూడు నెలల గర్భవతులను తాత్కాలికంగా అన్ఫిట్ అని పేర్కొందని.. ఇది వివక్ష, చట్టవిరుద్ధమని కమిషన్ చైర్మెన్ స్వాతి మలివాల్ అన్నారు. ఇది సామాజిక భద్రత కోడ్, 2020 కింద అందించిన ప్రసూతి ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. 'సర్వీసులో చేరే సమయంలో మూడు నెలల గర్భిణీగా ఉన్న మహిళలను ఉద్యోగంలో చేర్చుకోరాదంటూ మార్గదర్శకాలను ఎస్బీఐ జారీ చేసింది. ఇది వివక్ష, చట్టవిరుద్ధం. ఈ మహిళా వ్యతిరేక నిబంధనలను ఉపసంహరించుకోవాలని కోరుతూ నోటీసులు జారీ చేశాం' అని ఆమె ట్వీట్ చేశారు.