Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోసపూరిత సందేశాలకు స్పందించవద్దు
- పాస్వర్డ్ వివరాలు బయటపెట్టొద్దు : ఆర్బీఐ హెచ్చరిక
న్యూఢిల్లీ : బ్యాంక్ ఖాతాదార్లను తప్పుదారి పట్టిస్తూ సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారని.. ఖాతాదార్లు పలు జాగ్రత్తలు పాటించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చీఫ్ జనరల్ మేనేజర్ యోగేష్ దయాల్ హెచ్చరించారు. సామాజిక మాధ్యమంలో, ఇంటర్నెట్, ఫోన్ కాల్స్ ద్వారా ఖాతాదార్ల సమాచారాన్ని సైబర్ మోసగాళ్లు కొత్త కొత్త పద్దతుల్లో సేకరిస్తున్నారని ఆయన అన్నారు. మోసపూరిత సందేశాలు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని, తప్పుడు లింక్స్, నోటిఫికేషన్లు, క్యూఆర్ కోడ్స్, డిస్కౌంట్స్ ఇస్తామనే ప్రకటనలు నమ్మవద్దని శనివారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసగాళ్లు అనుసరిస్తున్న వివిధ పద్ధతుల గురించి ఖాతాదార్లకు అవగాహన కల్పించేందుకు పలు వివరాలు వెల్లడించారు. సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ కోసం అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని, బ్యాంక్ ఖాతా, లాగిన్ ఐడీ, పాస్వర్డ్, యూపీఐ పిన్, ఏటీఎం పిన్..వివరాలేవీ మోసగాళ్ల చేతిలో పడకుండా చూసుకోవాలని చెప్పారు. సంబంధిత బ్యాంక్ శాఖలకు వెళ్లి కేవైసీ వివరాలు నేరుగా అందజేయాలని అన్నారు. అనవసరమైన యాప్స్‌ను స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేస్తే..బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్ల చేతిలో పడే ప్రమాదముందని హెచ్చరించారు.