Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. భారత్-ఇజ్రాయెల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో 'పెగాసస్' ఓ ముఖ్య భూమిక వహించిందని 'న్యూయార్క్ టైమ్స్'లో ప్రచురితమైన వార్తా కథనంపై రాహుల్‌గాంధీ స్పందించారు. ''ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోడీ సర్కార్ పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ఫోన్లను ట్యాపింగ్ చేయటం ద్వారా ప్రతిపక్షాన్ని, కోర్టులను వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఇది దేశద్రోహం. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది'' అని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇది అబద్ధాలు, మోసాల ప్రభుత్వం
సీతారాం ఏచూరి, సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇజ్రాయిల్ నుంచి 2017 లోనే సైనిక నిఘా పరికరాలను కొనుగోలు చేసిందని 'న్యూయార్క్ టైమ్స్ బయట పెట్టింది. దీంతో మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు, పార్లమెంటుకు, చివరికి పెగాసస్ కేసులో సుప్రీం కోర్టుకు సైతం అబద్దాలు చెప్పింది. ప్రభుత్వ తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ప్రభుత్వం నిష్కళంకంగా ప్రజల ముందుకు రావాలి
సుపారీ మీడియా : కేంద్ర మంత్రి వి.కె సింగ్
మీరు న్యూయార్క్ టైమ్స్‌ను విశ్వసిస్తున్నారా? వారంతా సుపారీ మీడియా.