Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి 28, 29ల్లో సమ్మె
- బీజేపీ ప్రభుaత్వాన్ని ఓడించేందుకు విస్తృత ప్రచారం
- కేంద్ర కార్మికుల సంఘాలు పిలుపు
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఉమ్మడి వేదికగా పిలుపిచ్చిన రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె తేదీలు మారాయి. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగాల్సిన సమ్మెను మార్చి 28, 29 తేదీలకు మారాయి. కేంద్ర కార్మిక సంఘాలు సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ తదితర కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఉమ్మడి వేదిక నేతలు ఆన్లైన్ సమావేశం జరిగింది. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్టు నేతలు తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దేశవ్యాప్తంగా రెండు రోజుల సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని 2021 నవంబర్ 11న జరిగిన కార్మికుల నేషనల్ కన్వెన్షన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అనేక రాష్ట్రాలు, రంగాలలో సమ్మె సన్నాహాలు ప్రారంభమయ్యాయనీ, ఉమ్మడి రాష్ట్ర స్థాయి సమావేశాలు, కొన్ని రాష్ట్రాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కూడా జరిగాయి. అయితే, ఓమిక్రాన్ మహమ్మారి మూడో వేవ్ పెరుగుతున్న కారణంగా సమ్మె సన్నాహాలపై అనేక రాష్ట్రాలు తీవ్ర పరిమితులను ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా ఫిబ్రవరి 23న యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఫిబ్రవరి 23-24 తేదీల్లో తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక సంఘాలు, సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్ల ఉమ్మడి ప్లాట్‌ఫారమ్ సార్వత్రిక సమ్మె తేదీలను మార్చి 28, 29 తేదీలకు వాయిదా వేయాలని నిర్ణయించినట్టు కార్మిక నేతలు తెలిపారు. ఆ సమయంలో రెండో దశ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రజలను రక్షించేందుకేనని అన్నారు. కొనసాగుతున్న సన్నాహక ప్రచారాన్ని ఉధృతం చేయాలని ఉమ్మడి వేదిక శ్రామిక ప్రజలకు, సంఘాలకు పిలుపునిచ్చింది. విధ్వంసకర, దేశ వ్యతిరేక విధాన పాలన నుంచి దేశాన్ని రక్షించాలనీ, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం ఎన్నికల బరిలో ఉన్న రాష్ట్రాల్లోని కార్మికులు, కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేయాలని ఉమ్మడి వేదిక పిలుపునిచ్చింది.