Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జస్టిస్ రవీంద్రన్ కమిటీ
- ప్యానెల్‌ను కోరిన ఎడిటర్స్ గిల్డ్
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ కొనుగోలు గురించి న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన దిగ్బ్రాంతికర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ ఆర్వి రవీంద్రన్ కమిటీకి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆదివారం విజ్ఞప్తి చేసింది. 2017లోనే పెగాసస్ స్పైవేర్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం కుదిరిందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన దృష్ట్యా. దీనిలో ప్రభుత్వం, మంత్రుల భాగస్వామ్యం గురించి వారి స్పందనలను కూడా కోరాలని ఎడిటర్స్ గిల్డ్ సూచించింది. కమిటీ ప్రొసీడింగ్స్‌ను అందరికీ తెలిసేలా పూర్తి పారదర్శకంగా ఉండాలని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. ఇందుకు సంబంధించి ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ జస్టిస్ రవీంద్రన్‌కు ఒక లేఖ రాసింది. దేశంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్లపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించి నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు గత ఏడాది జస్టిస్ రవీంద్రన్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 8 వారాల్లో తన నివేదికను సుప్రీంకు సమర్పించాల్సి ఉంది.