Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : ఓ దళితుడు పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన ఘటన రాజస్తాన్లో చోటుచేసుకుంది. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. చురు జిల్లాలోని రుక్షాసర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల రాకేశ్ మేఘ్వాల్ అనే దళితుణ్ని ఈ నెల 26న కిడ్నాప్ చేసి.. కారులో ఓ ప్రాంతానికి తీసుకు వెళ్లారని చెప్పారు. అనంతరం మద్యం బలవంతంగా తాగించి.. అనంతరం అదే బాటిల్లో మూత్రం కలిపి గొంతులో పోశారని, తీవ్రంగా కొట్టారని తెలిపారు. పాత కక్షలతో రగిలిపోతున్న కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారని వెల్లడించారు. కులదూషణలు చేశారని, అనుచిత పదజాలాన్ని వాడారని పేర్కొన్నారు. పెత్తందార్ల జోలికి వస్తే దళితులకు తగిన గుణపాఠం చెబుతామంటూ బెదిరించినుట్ల పోలీసులు తెలిపారు. బాధితుడు ఒంటిపై దెబ్బలున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఇద్దర్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. నిందితులపై ఐపిసిలోని 143,323, 365,382 సెక్షన్లో పాటు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్ల చెప్పారు.