Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు 2 లక్షలకుపైనే నమోదవుతున్నాయి. కోవిడ్ మరణాలు భారీగానే నమోదవుతున్నాయి. మరోవైపు.. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తున్నది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. నిన్న 62,22,682 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 165 కోట్లు దాటింది.కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం...గడిచిన 24 గంటల్లో 16,15,993 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,34,281 కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యాయి.ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఎక్కువగా 50,812 కేసులు నమోదయ్యాయి.మహారాష్ట్రలో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న ఆ రాష్ట్రంలో 27,971 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతం నుంచి 14.50శాతానికి పెరిగింది. నిన్న ఒక్క రోజే 893 మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,94,091కి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,52,784 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.87 కోట్లకు చేరింది. దీంతో రికవరీ రేటు 94.21 శాతానికి చేరింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 18,84,937 కి చేరి..ఆ రేటు 4.59 శాతంగా కొనసాగుతున్నది.