Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో ప్రజాస్వామ్యం కనుమరుగు : బీజేపీ ఎమ్మెల్యే సుదీప్ రారు
న్యూఢిల్లీ : త్రిపురలో అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. స్వంత పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యే సుదీప్ రారు బర్మన్ రాష్ట్రంలో బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. త్రిపురలో ప్రజాస్వామ్యమే లేదని, బీజేపీ పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని అన్నాడు. ప్రజలు విసిగివేసారి పోయారని, తన లాంటి నాయకులు ఏమీ చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. సుదీప్ రారు బర్మన్ చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు అధికార బీజేపీ సమాధానం చెప్పుకోలేక సతమతమవుతోంది. రాష్ట్ర ఆరోగ్యమంత్రిగా ఉన్న బర్మన్ను 2019లో బీజేపీ సర్కార్ తొలగించింది. దాంతో ఆయన పార్టీని వీడనున్నారని వార్తలు వెలువడ్డాయి. నియోజికవర్గ ప్రజల అభిప్రాయం మేరకు తాను నిర్ణయం తీసుకుంటానని మంత్రి పదవికి రాజీనామా చేశాక బర్మన్ ప్రకటించారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరగనున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది జరగనున్న నేపథ్యంలో సుదీప్ రారు బర్మన్ వ్యాఖ్యలు బీజేపీకి మింగుడు పడటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ పార్టీలో నుంచి 2017లో బర్మన్ బీజేపీలో చేరారు.