Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లైసెన్స్ రద్దే కారణమా ?
- కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు
న్యూఢిల్లీ : మలయాళం వార్తా చానెల్ మీడియా వన్ టివి ప్రసారాలు సోమవారం (జనవరి 31) నిలిచిపోయాయి. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చానెల్ లైసెన్స్‌ను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి 'భద్రతాపరమైన ఆందోళనలను' కారణాలుగా మంత్రిత్వ శాఖ పేర్కొందని చానెల్ యాజమాన్యం తెలిపింది. ''భద్రతా కారణాల రీత్యా చానెల్ ప్రసారాలను అనుమతించడం లేదని మాత్రమే ప్రభుత్వం చెప్పింది. అంతకుమించి వివరాలు ఇవ్వలేదని చానెల్ ఎడిటర్ ప్రమోద్ రామన్ ఒక ప్రకటనలో తెలిపారు. చానెల్‌ను పునరుద్ధరించుకోవడం కోసం మీడియా వన్ తక్షణమే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి వుందని అన్నారు. సాధ్యమైనంత త్వరలోనే ప్రేక్షకులను కలుసుకోగలమని ఆశిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి మా ప్రసారాలు నిలిపివేస్తున్నామని చెప్పారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తోసిపుచ్చాలని కోరుతూ చానెల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు లైవ్ లా న్యూస్ పోర్టల్ తెలిపింది. ఎలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు తమ చానెల్ పాల్పడలేదని, అందువల్ల ఈ లైసెన్స్ రద్దు ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ చానెల్ కోర్టుకెళ్ళిందని ఆ న్యూస్ పోర్టల్ పేర్కొంది.