Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది ముగింపునాటికి 488 మంది
- 2004 తర్వాత 17 ఏండ్లలో ఇదే అత్యధికం : తాజా నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య భారీగా పెరిగింది. గతేడాది ముగింపునాటికి ఇది 488కి చేరుకున్నది. మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య గత 17 ఏండ్లలో ఇదే అత్యదికం కావడం గమనార్హం. అయితే, ఈ మరణ శిక్షలు ఇంకా అమలు కాలేదు. 'డెత్ పెనాల్టీ ఇన్ ఇండియా రిపోర్ట్' ఈ విషయాన్ని వెల్లడించింది. 'ప్రాజెక్ట్ 39ఏ' ఈ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో 'ప్రాజెక్ట్ 39ఏ' ఒక భాగం. ఇది క్రిమినల్ చట్ట సంస్కరణల గురించి మాట్లాడే విశ్వ విద్యాలయ సమూహం.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలతో పోలిస్తే 2004 తర్వాత మరణశిక్ష ఖైదీల సంఖ్య అత్యధికంగా 488గా ఉండటం గమనార్హం. ఆ సమయంలో మరణశిక్ష ఖైదీల సంఖ్య 563గా ఉన్నది. మహమ్మారి కారణంగా కోర్టుల పరిమిత పనితీరు.. మరణశిక్ష సంబంధిత కేసులకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రభావితం చేసిందని నివేదిక వివరించింది.
నాలుగు మరణశిక్షలను నిర్ధారించిన హైకోర్టులు
దేశవ్యాప్తంగా 2021లో ట్రయల్ కోర్టులు 144 మరణ శిక్షలను విధించాయి. అయితే, ఇందులో 39 కేసులలో మాత్రమే వివిధ హైకోర్టులు తీర్పునిచ్చాయి. వీటిలో కేవలం నాలుగు మరణశిక్షలను నిర్ధారించడం గమనార్హం. 18 కేసులను జీవిత ఖైదుగా మార్చాయి. 15 కేసులో నిందితులను నిర్దోషులుగా, రెండు కేసులు తిరిగి ట్రయల్ కోర్టుకు పంపబడ్డాయి. వివిధ హైకోర్టులో 2020లో తీర్పునిచ్చిన మరణశిక్ష కేసులు 31గా, 2019లో 76గా ఉన్నాయి. సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబర్లో ప్రాధాన్యతపై మరణశిక్షకు సంబంధించిన కేసుల విచారణకు సిద్ధమైనప్పటికీ.. ఆరు కేసుల్లో మాత్రమే తీర్పును వెలువర్చింది. 2020లో 11 కేసులు, 2019లో 28 కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. గతేడాది సుప్రీంకోర్టు ఎవరికీ మరణశిక్షను విధించలేదు.
యూపీలో అధికంగా 86 మంది
ఈ 488 మంది ఖైదీలలో 86 మంది ఉత్తరప్రదేశ్లోని జైళ్లలో ఉన్నారు. కొందరు తదుపరి విచారణల కోసం వేచి ఉండగా, కొందరు డిఫెన్స్ పిటిషన్లు దాఖలు చేశారు. మరణశిక్ష కేసుల్లో అత్యధికంగా 62 కేసులు హత్యకు సంబంధించినవి. అలాగే, 44 లైంగిక వేధింపులు, హత్యలు, నాలుగు కేసులు ఉగ్రవాదానికి సంబంధించినవి కావటం గమనార్హం.