Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పీకర్‌కు నోటీసు ఇచ్చిన మూడు పార్టీలు
- పెగాసస్‌పై పార్లమెంటును తప్పుదోవ పట్టించారని ఆరోపణ
న్యూఢిల్లీ : పెగాసస్‌పై పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించినందుకు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌పై హక్కుల ఉల్లంఘన తీర్మానం చేపట్టాలంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ నేతలు స్పీకర్‌కు నోటీసులు అందచేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ కథనం వెలువడిన నేపథ్యంలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత అదిర్ రంజన్ చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పెగాసస్‌తో తమకెలాంటి సంబంధం లేదని, ఎన్ఎస్ఓ గ్రూపు నుండి తాము ఎలాంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయలేదని సభా వేదికపైనే ప్రభుత్వం చెబుతూ వచ్చిందని చౌదరి పేర్కొన్నారు. కానీ న్యూయార్క్ టైమ్స్ కథనం వెలువడిన తర్వాత, మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌ను, సుప్రీం కోర్టును తప్పుదారి పట్టించినట్లు కనిపిస్తోందన్నారు.ఈ నేపథ్యంలో, ఉద్దేశ్యపూర్వకంగా సభను తప్పుదారి పట్టించిన సమాచార శాఖ మంత్రిపై సభా హక్కుల తీర్మానం చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా ఇదే రకంగా నోటీసు ఇవ్వనున్నారు. సిపిఐ ఎంపివినరు విశ్వం, టిఎంసి ఎంపి సౌగత్ రారులు కూడా ఈ మేరకు సోమవారం నోటీసులు అందచేశారు. లీక్ అయిన పెగాసస్ లక్ష్యాల డేటాబేస్‌లో వైష్ణవ్ పేరు కూడా వుందని ది వైర్ వెల్లడించింది.