Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎఫ్‌డీఐలు పెరిగాయి
- సబ్ కా సాత్.. మూలసూత్రంతో ముందుకు : ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
న్యూఢిల్లీ : అత్యంత వేగంగా అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిం దని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 48 బిలియన్ డాలర్ల (సుమారుగా 3.5లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని తెలిపారు. దేశంలో పెట్టుబడులపై పెట్టుబడిదారులకున్న ధీమాను ఈ విషయం రుజువు చేస్తోందన్నారు. ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ఇందుకోసం ప్రభుత్వం అవిశ్రాతంగా కృషి చేస్తోందని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం ఏడు మెగా టెక్స్టైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. మొబైల్ ఉత్పత్తుల పరిశ్రమ ఎదుగుదల మేక్ ఇన్ ఇండియా విజయవంతానికి నిదర్శనమని చెప్పారు.
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాలులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. 52 నిమిషాల పాటు సుధీర్ఘంగా ప్రసంగం సాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం, ఆత్మ నిర్భర్ భారత్, దేశీయ విద్యా విధానంలో తీసుకువచ్చిన మార్పులు, పేద ప్రజలు, రైతులు, మహిళా సాధికారతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. దేశం సాధించిన ప్రగతి, సురక్షిత భవిష్యత్ కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోందో వివరించారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్' మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వచ్చే 25 ఏండ్లపాటు దేశ పునాదులు పటిష్టంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో మహిళల పాత్ర మరింత విస్తతం చేశామన్నారు. రైతులు, చిన్న రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు. దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు.