Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీడియాతో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్ కార్య క్రమం వంటి అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంచేలా పార్లమెంటు బడ్జెట్ సమా వేశాలు వేదిక కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభిలషించారు. వీటన్నింటిపై అర్ధవంతంగా చర్చిచేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడి యాతో ప్రధాని మోడీ మాట్లాడుతూ బడ్జెట్ సమావే శాలకు ఎంపీలకు స్వాగతం పలుకుతున్నామని, ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో గొప్పగొప్ప అవకాశాలున్నాయని అన్నారు. దేశాభివృద్ధికి కీలకమైన సమయంలో అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చర్చలు ఫలప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు.
కరోనా ప్రోటోకాల్ ఉల్లంఘన
దేశంలో కరోనా ఉధతంగా వ్యాప్తి చెందుతోన్న తరుణంలో బాధ్యత గల ప్రజా ప్రతినిధులు పార్లమెంటు సాక్షిగా నిబంధనలను తుంగలో తొక్కారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించిన సమయంలో ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రపతి ప్రసంగం కొనసాగుతుండగా ఎంపీలు భౌతిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. ఉభయ సభల్లోనూ ఎంపీలు భౌతికదూరం పాటిస్తూ కూర్చునేందుకు ఏర్పాట్లు చేసినా.. వారు అవేమీ పట్టించుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిలో కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక్కో బెంచ్‌పై ఐదుగురు నుంచి ఏడుగురు ఎంపీలు కూర్చుని, వారు మాట్లాడుతున్న సమయంలో మాస్కులను కిందికి జరిపారు.