Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022-23లో జీడీపీ 8.5 శాతం లోపే
- ఆర్థిక సర్వే-2022 రిపోర్ట్
- ప్రయివేటీకరణవైపు పరుగు
- అసంపూర్ణ నివేదిక..! ొ సవాళ్ల విస్మరణ
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మందగించనుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో 8-8.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆర్థిక సర్వే-2022 పేర్కొంది. సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) నేతత్వంలోని బందం రూపొందించిన ఈ ఆర్థిక సర్వే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ జోరు పెంపు, పంటల మార్పిడి పేరుతో ఆహార పంటల స్థానే వాణిజ్య పంటలకు ప్రోత్సాహం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊపునిచ్చే అంశాలకు సంబంధించి ఈ సర్వే కొన్ని ముఖ్యమైన సంకేతాలిచ్చింది. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారాలు, జీడీపీ వృద్థి రేటు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇంతకుముందు ఆర్థిక సర్వేలు ప్రస్తావించేవి. ఈ సర్వేలో ఆ ఊసే లేదని, ఇది అసమగ్రమైన సర్వే అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక సర్వేలోని కీలకాంశాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్థి ఉండొచ్చు. దీంతో పోల్చితే వచ్చే ఏడాది వృద్థిరేటులో తగ్గుదల చోటుచేసుకోవచ్చని విశ్లేషించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ జీడీపీ మైనస్ 7.3 శాతం క్షీణించింది. దీన్ని తాజాగా కేంద్ర గణంకాల శాఖ మైనస్ 6.6 శాతంగా సమీక్షించింది. కాగా.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వృద్థికి మద్దతును అందించనున్నాయని ఈ సర్వే పేర్కొంది. 2020 ప్రారంభం నుంచి కరోనా సంక్షోభంతో దేశ జీడీపీలో 55 శాతం వాటా కలిగిన ప్రయివేటు వినిమయం బలహీనంగా ఉంది. కుటుంబాల అప్పులు, రిటైల్ ధరల స్థాయి పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. గహాల అమ్మకాలు ఊపందుకుంటాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో లోటు పెరిగినప్పటికీ.. 2021-22లో ఆర్థిక స్థితి మెరుగవుతుంది. 2022 జనవరి 10 నాటికి దేశంలో 61,400కు పైగా స్టార్ట్ అప్ కంపెనీలు నమోదయ్యాయి. గతేడాది 44 స్టార్ట్అప్ కంపెనీలకు యూనికార్న్ హోదా లభించింది. దీంతో అమెరికా, చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో యూనికార్న్ సంస్థలు భారత్‌లో ఉన్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వద్ధికి ఎదురవుతున్న అడ్డంకులను గుర్తించకపోవడం.. వాటిని ఎలా ఎదుర్కొంటారనే దానిపై రిపోర్ట్‌లో స్పష్టత ఇవ్వలేదు. దాదాపుగా అన్నీ ప్రభుత్వానికి అనుకూలమైన అంశాలను మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కరోనా పూర్వస్థితికి చేరుకున్నాయని మంత్రి తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు. 2022-23లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధంగా ఉంద న్నారు. కానీ ప్రస్తుతం ఉన్నసవాళ్లు, కొత్తగా ఉత్పన్నమయ్యేవి ఎక్కడా కూడా తెలుపలేదు. కరోనాసంక్షోభం, ఇంధనధరల పెంపునతో ద్రవ్యోల్బ ణం ఎగిసిపడుతుండగా మరోవైపు సూక్ష్మ గణంకాలు బలహీనతతో ఆర్థిక వ్యవస్థ స్తబ్దతను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ అంశాలను మంత్రి ప్రస్తావించలేదు.