Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీిఎస్యూల్లో రూ.65వేల కోట్ల వాటాల అమ్మకం
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయాన్ని కేంద్రం వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 31 కల్లా ఈ సంస్థ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను తీసుకువస్తామని పదే పదే ప్రకటించిన మోడీ సర్కార్ తాజా బడ్జెట్లో ఈ ప్రక్రియను వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఎల్ఐసీలో వాటాలను విక్రయించడం ద్వారా రూ.1 లక్ష కోట్ల వరకు సమీకరించాలని తొలుత లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా దీన్ని రూ.66వేల కోట్లకు తగ్గించుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో వివిధ పీఎస్యూల్లో రూ.65 వేల కోట్ల వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ ఈ బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకుంది. 2021-22లో రూ.1.75 లక్షల కోట్ల డిజిన్వెస్ట్మెంట్ చేయాలని నిర్దేశించుకుంది. ఇప్పటి వరకు రూ.78వేల కోట్ల విలువ చేసే పీఎస్యూల వాటాలను విక్రయించింది.