Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్..2022పై 58 శాతం మంది అభిప్రాయం
- కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల ప్రసంగంపై ప్రజా మనోగతం
- కేవలం 12 శాతం మంది మాత్రమే ఓకే..
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2022..పై ఆదాయపు పన్నుపై ఊరట కలిగించే అంశం వస్తుందనకున్నా. కానీ ఎలాంటి వెసులుబాటు కల్పించలేదని 72 శాతం మంది నిరాళ వ్యక్తం చేశారు.58 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. ఈ బడ్జెట్తో ఎలాంటి ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని 55 శాతం కంటే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా సర్వేలో పెద్దగా ఉపశమనం పొందడం లేదు. ఓ జాతీయ పత్రిక నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత ఐదు ప్రశ్నల సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో సుమారు లక్ష మంది వివిధ ప్రశ్నలపై పాల్గొన్నారు. 2022 బడ్జెట్ ప్రసంగంపై ప్రజలు నిర్మోహమాటంగా ఇది కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికలకోసమే బడ్జెట్ అన్నట్టు ఉన్నదని అభిప్రాయపడ్డారు.