Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 80 లక్షల కొత్త ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంపై ఎలాంటి ప్రకటన లేదు
న్యూఢిల్లీ : ఈ బడ్జెట్లో ఇండ్లు కొనుగోలు చేసిన ప్రజలు నిరాశకు గురవుతారు. 45 లక్షల వరకు ఉన్న ఇండ్లపై 1.5 లక్షల వరకు వడ్డీ రాయితీ గురించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఈ పథకం 31 మార్చి 2022తో ముగుస్తుంది. అంటే, మీరు ఏప్రిల్ 1, 2022 నుంచి ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొందలేరు. అయితే, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 80 లక్షల కొత్త ఇండ్లు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.48,000 కోట్లు ఖర్చు చేయనున్నది. 45 లక్షల వరకు ఇండ్ల కొనుగోలుపై 1.5 లక్షల వరకు వడ్డీ మినహాయింపును 2021 నుంచి మార్చి 2022 వరకు ప్రభుత్వం పొడిగించింది. మొదటి సారి ఇల్లు కొనే వారికి మాత్రమే ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
2021 గ్రామాల్లో 26.20 లక్షల ఇండ్ల నిర్మాణం
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీన్ (పపీఎంఏవై-జీ) కింద 2021 సంవత్సరంలో నవంబర్ 25 వరకు 26.20 లక్షల ఇండ్లు నిర్మించగా,. అదే సమయంలో, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అర్బన్ (పపీఎంఏవై-jయూ)లో 2021 సంవత్సరంలో డిసెంబర్ వరకు 4.49 లక్షల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయితే రియల్ ఎస్టేట్ లో మోసాలు నివారించటానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది.
దేశంలో రియల్ ఎస్టేట్ పరిస్థితేంటీ..?
దేశంలో వ్యవసాయం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం రెండవ అతిపెద్ద ఉపాధి కల్పిస్తోంది. అలాగే, దేశ ఆర్థిక వ్యవస్థలోని 14 పెద్ద రంగాలలో ఇది మూడవ అత్యంత సహకార రంగం.దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి (సుమారు రూ. 76 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా . ఇది 2021లో సుమారు రూ. 16 లక్షల కోట్లు.2025 నాటికి దేశ జీడీపీకి 13 శాతం తోడ్పడుతుందని అంచనా. ఇయితే ప్రస్తుతం 7 శాతం మాత్రమే.