Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊసేలేని పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ : మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపించింది. ఆదాయపు పన్ను (ఐటీ) మినహాయింపులపై ఈ బడ్జెట్లో ఎటువంటి ప్రస్తావనా తీసుకురాలేదు. దీంతో వేతన జీవులు తీవ్ర నిరాశకు గురైయ్యారు. కరోనా సంక్షోభంతో అనేక మంది ఉద్యోగుల రాబడిలో కోతలు పడ్డాయి. ఈ కాలంలో మధ్య, దిగువ మధ్యతరగతి వారి ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఉన్న ఆదాయాలపై పన్ను తగ్గిస్తే.. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా వస్తువులకు డిమాండ్ పెరగడంతో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. కానీ.. ఈ విషయాన్ని కేంద్రం విస్మరించింది. ఈ దఫా బడ్జెట్లోఐటి చెల్లింపుదారుల ఊసే ఎత్తకపోవడంతో ఆ వర్గాలు ఉసురుమన్నాయి. దీంతో ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథంగా కొనసాగనున్నాయి. కాగా.. కొన్ని స్వల్ప మార్పులు మాత్రం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని 10 నుంచి 14 శాతానికి పెంచారు. యజమాని వాటా కింద చెల్లించే 14 శాతం వరకు పన్ను మినహాయింపు ఉంది. దీన్ని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయడంతో వారికి స్వల్ప ఊరట లభించింది. ఇక ఆదాయ పన్ను దరఖాస్తుల్లో జరిగే పొరపాట్లను సరి చేసుకునేందుకు కేంద్రం రెండేళ్ల వరకు అవకాశం కల్పించింది. పన్ను శ్లాబులలో ఎలాంటి ఉపశమనం లేకోపోవడంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలతో ట్రెండింగ్ చేశారు. పన్ను శ్లాబుల్లో కోతలను తేనందుకు పన్ను చెల్లింపుదారులకు మంత్రి సీతారామన్ క్షమాపణ తెలిపారు.