Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంఘీభావ సదస్సులో ఏపీ వామపక్షాల నేతలు
అమరావతి : ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 13 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు సమ్మెలోకి వెళుతుంటే.... సామరస్యంగా సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదని వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు పేర్కొన్నారు. ఉద్యోగుల పోరాటానికి సంఘీభావంగా మంగళవారం విజయవాడలోని దాసరి భవన్లో సీపీఐ(ఎం) నాయకులు డి.కాశీనాథ్, సీపీఐ నాయకులు దోనేపూడి శంకర్ అధ్యక్షతన వామపక్ష పార్టీల సదస్సు జరిగింది. సదస్సులో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ పీఆర్సీపై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం న్యాయమైందన్నారు. పీఆర్సీపై అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని వారు ప్రశ్నించారు. ఇప్పటిదాకా చరిత్రలో ఐఆర్ కంటే ఫిట్మెంట్ ఎక్కువ ఉండగా, జగన్ ప్రభుత్వం మాత్రం ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చిందన్నారు. ఉద్యోగుల జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయనే పాలకపెద్దలు ఎమ్మెల్యేలు, మంత్రులు, సలహాదారు లకు వేతనాల రూపంలో ఎంత ఖర్చుచేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యోగుల అన్ని రకాల పోరాటాలకు వామపక్షాలు అండగా ఉంటాయని చెప్పారు. ఉద్యోగులను రెచ్చగొట్టేలా ప్రభుత్వం కార్య క్రమాలు చేసే.్త.. చూస్తూ ఊరుకోమనీ, ఉద్యోగుల పక్షాన తాము రోడ్లపైకి వస్తామనీ హెచ్చరించారు. ప్రజలను సమీకరించి వీధుల్లో పోరాటాలు చేయా లని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు ప్రసాద్ అన్నారు. ఉద్యోగులు గొంతెమ్మ కోరికలేమీ కోరడం లేదని, తమహక్కుల కోసం పోరాడుతు న్నారని ఎంసిపిఐ నాయకులు ఖాదర్ బాషా, ఎస్‌యుసిఐ నాయకులు సుధీర్‌బాబు, సిపిఐ(ఎంఎల్)లిబరేషన్ నాయకులు శేషగిరిరావు అన్నారు.