Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాతకు అనుకూల విధానాలతో రాష్ట్ర ప్రగతి : టీఆర్ఎస్ ఎంపీ జి.రంజిత్ రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బియ్యం సేకరణ అంశాన్ని లోక్‌సభలో 377 నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీ డా.జి.రంజిత్‌రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ సీఎం రైతు అనుకూల విధానాలతో రాష్ట్రం వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ, ఇప్పుడు రాష్ట్రం తన ఆహార ధాన్యాల అవసరాలను తీర్చగలిగే స్థాయికి ఎదిగిందన్నారు. మిగులు ధాన్యాలను లోటు రాష్ట్రాలకు పంపవచ్చని, ఆహార ధాన్యాల సేకరణ, పీడీఎస్ ద్వారా సరఫరా, బఫర్ స్టాక్ ఉంచడం కోసం ఎఫ్‌సీఐకి ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఎఫ్‌సీఐ మొత్తం సంవత్సరానికి సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించకపోవడం, ఉత్పత్తికి అనుగుణంగా కొనుగోళ్లు జరగకపోవడం వంటి విధానాలను అనుసరిస్తోందని ఆరోపించారు.ఇవి రైతు సమాజానికి, ప్రత్యేకించి తెలంగాణకు నష్టం చేస్తున్నాయని రంజిత్‌రెడ్డి విమర్శించారు.
తెలంగాణలో ఉన్న కళ్యాణ్ ఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణపల్లి నాలుగు బొగ్గు గనులను వేలం ద్వారా బొగ్గు అమ్మకానికి కేటాయింపు చేశామని, నియమాలు రూపొందించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి వాటిని సింగరేణి కాలరీస్‌కు కేటాయించాలని అభ్యర్థించిందని పేర్కొన్నారు. అయితే, బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న ప్రస్తుత విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి వేలం పద్ధతిలో అన్ని బొగ్గు బ్లాకులను కేటాయించడానికి సిద్ధం చేస్తున్నారన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి కాలరీస్‌తో పాటు ఇతర సంస్థలు వేలంలో పాల్గొని, నిర్దేశించిన నిబంధనల ప్రకారం బొగ్గు బ్లాక్‌లను తీసుకోవచ్చని టీఆర్ఎస్ ఎంపీలు వెంకటేశ్ నేత, దయాకర్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు.
రాజ్యసభ ప్రశ్నోత్తరాలు
1 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లోని పంచాయతీలకు 14, 15 ఆర్థిక కమిషన్లు కింద నిధులు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది.