Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సమానత్వం, సామాజిక న్యాయాన్ని విశ్వసించే వారంతా ఒకే తాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా 36 మంది నేతలకు ఆయన లేఖ రాశారు. 'మన ప్రత్యేకమైన, వైవిధ్యభరితమైన, బహు సాంస్కృతిక సమాఖ్య.. మతోన్మాదం, మత ఆధిపత్యం ముప్పులో ఉంది. సమానత్వం, ఆత్మాభిమానం, సామాజిక న్యాయంపై విశ్వాసం ఉన్నవారంతా ఏకమైతేనే ఈ శక్తులను అడ్డుకోగలం' అని లేఖలో పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు.. కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మండల్ కమిషన్‌ను స్థాపించడానికి మనం చేసిన కృషిని గుర్తు చేసుకుని.. అదే స్ఫూర్తితో మనం ఏకం కావాలని తెలిపారు. కాగా, గత నెల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్టాలిన్ ప్రసంగిస్తూ... 'ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్'ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. ఈ ఫెడరేషన్‌కు అన్ని రాష్ట్రాల్లో ఉన్న అణగారిన వర్గాల నాయకులు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.