Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైల్వేలో సరెండర్ అవుతున్న వందలాది పోస్టులు
- దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం..తగ్గుతున్న ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఓ వైపు ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రయివేటు పరం చేస్తున్న మోడీ ప్రభుత్వం రైల్వేలను ప్రయివేటీకరిస్తామని ప్రకటించింది. అందువల్లే ఖాళీలున్నా...భర్తీకి నై అంటోందన్న చర్చ నడుస్తోంది. అయితే రైల్వేలో ఉద్యోగాల భర్తీ విషయంలో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటోంది. వాస్తవానికి లక్షలాది పోస్టులు భర్తీ చేస్తామని కేంద్రం చెబుతున్నా గత ఐదేండ్లలో రైల్వే శాఖ అనేక పోస్టులను సరెండర్ చేసింది. 2014లో బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చిన విషయం విదితమే. అయితే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఉద్యోగి అయిన రైల్వేశాఖ ఏటా అనేక పోస్టులను రద్దు చేసింది. గల్లీ నుంచి పార్లమెంటు వరకు ఈ అంశం చర్చనీయాంశమైంది. బీహార్,రాజస్థాన్ సహ పలు రాష్ట్రాల్లో రైల్వే పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ..అభ్యర్థులంతా ఆందోళనకు దిగిన విషయం విదితమే. రైళ్లు నిలిచిపోయాయి. రోడ్లను దిగ్బంధించారు. దీనిపై విచారణకు కమిటీ వేసింది. నిరసనకారులపై ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు.
వాస్తవానికి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 35000 పోస్ట్‌లను విడుదల చేసింది. 2019లో దరఖాస్తులను ఆహ్వానించింది. 1.25 కోట్లకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. దేశంలో ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతుంటే మరోవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఒక్క భోపాల్ డివిజన్‌లోనే 2016-17లో 18717 మంజూరైన పోస్టులు 2020-21 నాటికి 17,998కి తగ్గాయి. గత ఐదేండ్లలో, రైల్వే 1402 పోస్టులను సరెండర్ చేసింది, అయితే 683 కొత్త పోస్టులు మాత్రమే వచ్చాయి అంటే భోపాల్ డివిజన్‌లోనే 719 పోస్టులు తగ్గాయి. మొత్తం ఉత్తర రైల్వేలో, గత ఐదేండ్లలో 18011 పోస్టులు సరెండర్ అయ్యాయి. కొత్త పోస్టులు 12881 వచ్చాయి అంటే 5130 పోస్టులు తగ్గాయి. గ్రూప్ సిలో మంజూరైన పోస్టులు 114065 కాగా ఖాళీ పోస్టులు 28550, అదే విధంగా గ్రూప్ డిలో మంజూరైన పోస్టులు 53770, ఖాళీ పోస్టులు 8886 ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా మోడీ ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రక్రియ లేదు. ఉన్న ు. పోస్టులను సరెండర్ చేస్తోంది.సీఎంఐఈ గణాంకాలు ప్రకారం, సెప్టెంబర్-డిసెంబర్ 2021లో దేశంలో మొత్తం నిరుద్యోగుల సంఖ్య 3.18 కోట్లు. 2020 లాక్డౌన్లో దేశంలో మొత్తం 2.93 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. అలాగే, ప్రస్తుతం 1.24 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వెతుకులాటలో ఉన్నారు. అంటే వారిని కూడా కలుపుకుంటే నిరుద్యోగుల సంఖ్య 4.27 కోట్లు అవుతుంది. పోస్టులను పూర్తిగా భర్తీ చేయనప్పుడు...ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయని నిరుద్యోగ యువత మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఏప్రిల్-డిసెంబర్ 2021 నుండి, 41,483 మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమయ్యాయి, నిర్వహణ పేరుతో 35,000 రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరో విషయం ఏమిటంటే, ప్రభుత్వం మూడేండ్లలో వందే భారత్ రైళ్లను నడిపినప్పటికీ, ఇప్పుడు లక్ష్యం 400 వందే భారత్ రైళ్లు కానీ పేద ప్రజలపై అదనపు భారాలు మోపింది. గత 9 నెలల్లో పీఎన్ఆర్ రికార్డ్ 7612427 దీనిలో మొత్తం 119373630 అంటే ఒక కోటి కంటే ఎక్కువ మంది ప్రయాణీకుల టిక్కెట్లు చార్ట్ ప్రిపరేషన్ సమయంలో సీటు నిర్ధారించక.. ఆటోమేటిక్‌గా వారు బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేయబడ్డాయి. రద్దీ రూట్లలో రైళ్ల కొరత ఎంతగా ఉన్నదో ఈ లెక్కే చెబుతోంది..