Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ : కేంద్ర సర్వీసుల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నట్టు వెల్లడయ్యింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 8,75,158 పోస్టులు ఖాళీలున్నాయని కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపి వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. గ్రూప్-ఏలో 21,255, గ్రూప్-సీ కేటగిరీల్లో 7,56,146 ఖాళీలు ఉన్నాయని మంత్రి సమాధానమిచ్చారు. గతంలో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గ్రూప్-బీలో గెజిటెడ్ పోస్టులు 17,005, నాన్ గెజిటెడ్ పోస్టులు 80,752 ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కార్మిక, యువజన సంఘాలు ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కేంద్ర సర్వీసుల్లో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉండడం ఎంతమాత్రం సమంజసం కాదని ఎంపీ శివదాసన్ అన్నారు. వీలైనంత త్వరగా ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.