Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో ఘటన
- తృటిలో తప్పిన ప్రమాదం
లక్నో : ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాన్వారుపై కాల్పులు జరిగాయి. ఆయన వాహనంపై ఇద్దరు దుండగులు.. మూడు నుంచి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. మీరట్ ఎన్నికల ర్యాలీని నిర్వహించి ఢిల్లీకి వెళుతున్న ఆయన కాన్వారు చాజర్సీ టోల్గేట్ వద్దకు చేరుకున్న సమయంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, దుండగులు కాల్పులు జరిపి... ఆయుధాలను అక్కడే వదిలేసి వెళ్లినట్టు సమాచారం. అయితే కారుకు బుల్లెట్లు తగలడంతో టైర్ పంచరైందని, తాను మరో వాహనంలో ఢిల్లీకి చేరుకున్నట్టు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. తాను క్షేమమేనంటూ పేర్కొన్నారు. యూపీలో అసదుద్దీన్ పార్టీ 92 స్థానాల్లో పోటీ చేస్తున్నది.