Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్కేఎం పిలుపు ొ 'మిషన్ ఉత్తరప్రదేశ్' ప్రారంభం
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక బీజేపీని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ద్రోహం చేసిన బీజేపీని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. గురువారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, దర్శన్ పాల్, రాకేష్ టికాయత్, యోగేంద్ర యాదవ్, జగ్జీత్ సింగ్ దల్లేవాలా, జోగేంద్ర సింగ్ ఉగ్రహాన్, శివకుమార్ కక్కాజీ, ధర్మేంద్ర మాలిక్ తదితర నేతలు మాట్లాడారు.
ఈ సందర్భంగా ''మిషన్ ఉత్తరప్రదేశ్''ను ప్రారంభించారు. ఎస్కేఎంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి మోడీ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను హైలైట్ చేస్తూ ఎస్కేఎం హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఒక పత్రం విడుదల చేసింది. ఎంఎస్పీపై ప్యానెల్‌ను ఏర్పాటుచేస్తామన్న హామీని ప్రభుత్వం నెరవేర్చలేదనీ, రైతులపై కేసులు ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేయలేదని విమర్శించారు. అలాగే ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం, లఖింపూర్‌ఖేరీ ఘటనలో సూత్రధారి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా సస్పెండ్ తదితర డిమాండ్లపై బీజేపీ ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. రైతులకు ద్రోహం చేస్తున్న బీజేపీని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని యూపీలోని రైతులకు ఎస్కేఎం నేతలు విజ్ఞప్తి చేశారు. ''రాబోయే రోజుల్లో మీరట్, కాన్పూర్, సిద్ధార్థనగర్, గోరఖ్‌పూర్, లక్నోతో సహా తొమ్మిది చోట్ల మేం విలేకరుల సమావేశాలను ఏర్పాటుచేస్తాం. మా విజ్ఞప్తితో కూడిన కరపత్రాలు ఉత్తరప్రదేశ్ అంతటా పంపిణీ చేస్తాం' అన్నారు.
మిగిలిన డిమాండ్లను నెరవేర్చాలని మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎస్కేఎం, ఇతర రైతులు జనవరి 31న దేశవ్యాప్తంగా విద్రోహ దివస్ నిర్వహించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్న ఎస్కేఎం పిలుపుకు 57 రైతు సంఘాలు మద్దతు తెలిపాయని ఎస్కేఎం నేతలు తెలిపారు. అయితే, ఫలానా పార్టీకి ఓటు వేయాలని చెప్పటంలేదనీ, బీజేపీని ఓడించాలని మాత్రమే చెబుతున్నామని రైతు నేతలు స్పష్టం చేశారు. విలేకరుల సమావేశానికి ముందు ఏఐకేఎస్ కార్యాలయంలో ఎస్కేఎం నేతలు సమావేశమయ్యారు.