Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలు తరువాత ఏర్పాటు చేస్తాం : రాజ్యసభలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో ఎంఎస్పీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఆ కమిటీని ఏర్పాటుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించిందని వెల్లడించారు. ''కనీస మద్దతు ధరపై పారదర్శక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనిపై పరిశీలనలు జరుగుతున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ఎంఎస్పీపై కమిటీ ఏర్పాటు నిమిత్తం ఈసీకి లేఖ రాశాం. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం సూచించింది'' అని నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.