Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మెన్‌గా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) వైస్ చాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆయన ఆ పదవిలో ఐదేండ్ల పాటు, లేదా ఆయన వయసు 65 ఏండ్లు నిండేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు పదవిలో కొనసాగుతారని కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి కామిని చౌహాన్ రతన్ తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీష్ కుమార్ ఐఐటీ-మద్రాస్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్, పీహెచ్డీ చేశారు. అనంతరం కెనడాలోని వాటర్లూ విశ్వ విద్యాలయంలో పోస్ట్ డాక్టొరల్ రీసెర్చ్ చేశారు. ఐఐటీ ఢిల్లీలో ఎలక్ట్రికల్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2016 జనవరి నుంచి జేఎన్‌యూ వీసీగా విధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఐదేండ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2021 జనవరిలో ఆయన పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. కాగా, ఆయన పదవీ కాలం ఈనెల 26తో ముగుస్తుంది. ఇటీవల యూజీసీ చైర్మెన్ పదవికి నోటిఫికేషన్ జారీ కాగా మొత్తం 55 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. జగదీష్ కుమార్‌ను ఎంపిక చేసింది. జగదీష్ కుమార్.. యూజీసీ చైర్మెన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తిగా నిలవడం విశేషం. గతంలో తెలుగువారైన వాసిరెడ్డి శ్రీకృష్ణ 1961లో, జి. రామిరెడ్డి 1991-95 వరకు యూజీసీ చైర్మన్లుగా పనిచేశారు.